పల్లె బాటలో సౌకర్యాల పండగకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే

రిపోర్టర్: Alfa News Desk స్థలం: వడమాలపేట

తిరుపతి జిల్లా వడమాలపేట మండలం పచ్చికాల్వ గ్రామంలో రూపుదిద్దుకున్న పైపు కల్వర్టు, సీసీ రోడ్డును నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, స్థానిక సమస్యల పరిష్కారమే ప్రాథమిక లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక ప్రజలు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి హర్షం వ్యక్తం చేశారు. మౌలిక వసతుల కల్పనతో పల్లె రూపురేఖలు మారుతాయని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.