ఓటర్ల తొలగింపు ప్రక్రియను రద్దు చేయాలి: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్
రిపోర్టర్: రాము
స్థలం: హనుమకొండ
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో హక్కులను కాలరాస్తున్న ఎన్నికల సంఘం తీరుపై ఏఐఎస్ఎఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఊట్కూరి ప్రణీత్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల రిబ్బన్లతో నిరసన చేపట్టారు. తెలంగాణలో లక్షలాది ఓట్లను తొలగించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని వారు స్పష్టం చేశారు.