అమరావతిలో రైల్వేలైన్‌, గ్రిడ్‌ రోడ్ల కోసం భూసేకరణకు గ్రీన్‌సిగ్నల్‌

రిపోర్టర్: సునీల్ స్థలం: అమరావతి

అమరావతి రాజధానిలో ఎర్రుపాలెం-నంబూరు బ్రాడ్‌గేజ్‌ రైల్వేలైన్, ఐఆర్‌ఆర్‌, గ్రిడ్‌ రోడ్ల విస్తరణకు ప్రభుత్వం భూసేకరణ ఉత్తర్వులు జారీ చేసింది. తాడికొండ, కంతేరు గ్రామాల్లో భూసమీకరణకు, కొప్పురావూరు, పెదకాకానిలో బఫర్‌ జోన్‌ కోసం నేరుగా భూసేకరణ చేపట్టేందుకు ఏపీ సీఆర్‌డీఏకి అనుమతి లభించింది. రైతుల అంగీకారం మేరకు ఈ ప్రక్రియను వేగవంతం చేయనున్నారు.