కావలిలో రూ.304 కోట్ల విలువైన స్థిరాస్తి అక్రమాలు వెలుగులోకి

రిపోర్టర్: శివ స్థలం: Kavali

కావలి పట్టణ పరిధిలో వైకాపా హయాంలో జరిగిన భారీ స్థిరాస్తి అక్రమాలు విజిలెన్స్ విచారణలో వెలుగుచూశాయి. నుడా అనుమతులు లేకుండా నీటి గుంతలు, చెరువులు, శ్మశాన పోరంబోకు భూములను ఆక్రమించి ప్లాట్లుగా విక్రయించినట్లు నిర్ధారించారు. ఈ ఆర్థిక మోసాల విలువ రూ.304 కోట్లుగా అంచనా వేసిన విజిలెన్స్ అధికారులు ఆరుగురు రియల్ వ్యాపారులను నిందితులుగా తేలుస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.