టీఎంసీకి భారీ షాక్, బీజేపీలోకి ఆ పార్టీ ఎంపీలు!

రిపోర్టర్: సతీష్ స్థలం: పశ్చిమ బెంగాల్

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కు భారీ షాక్ తగలనుంది. ఆ పార్టీకి చెందిన 20 మంది ఎంపీల్లో 17 మంది బీజేపీలో చేరే అవకాశం ఉందని రెబల్ నేత జగదీష్ చంద్ర బర్మా బసునియా సంచలన ప్రకటన చేశారు. దుర్గాపూజకు ముందు లేదా తరువాత ఈ భారీ ఫిరాయింపులు ఉండే అవకాశం ఉందని, ఇది పార్టీకి కోలుకోలేని దెబ్బని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.