కులం, మతం పేరుతో రాజకీయాలంటూ వైజాగ్ వేదికగా విజయసాయిరెడ్డి ధ్వజం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: విశాఖపట్నం

రాష్ట్రంలో కుటుంబ పార్టీల పాలన కొనసాగుతోందని, కులం, మతం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ, టీడీపీ రెండు పార్టీలు కూడా కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం చేయట్లేదని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేసి కేవలం పదవుల కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో పాలకు పూర్తిగా విఫలమయ్యారని, రాబోయే రోజుల్లో కొత్త ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరమని ఆయన స్పష్టం చేశారు.