ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే రేవూరి

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హనుమకొండ

హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం చౌళ్లపల్లి ప్రభుత్వ పాఠశాలను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన ఆయన, నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. అల్పాహారం పథకం అమలుతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరుస్తామని ఆయన పేర్కొన్నారు.