కామారెడ్డిలో చంద్రన్న భరోసా: అంత్యక్రియలకు వచ్చే వారికి ఉచితంగా భోజన వసతి

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: కామారెడ్డి

కుటుంబంలో ఆప్తులను కోల్పోయి విషాదంలో ఉన్న వారికి అండగా నిలిచేందుకు జీసీఆర్ ట్రస్ట్ ద్వారా చంద్రన్న భరోసా పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గంలో దీపావళి తర్వాత ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన వెల్లడించారు. ఎవరైనా మరణిస్తే ఉచిత టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయగానే అన్నపూర్ణ సేవా రథం ద్వారా హాట్ బాక్సుల్ లో భోజనాలు అందిస్తామని పేర్కొన్నారు.