సినిమాల నుంచి తనను తొలగించిన వైనంపై నటి తాప్సీ ఆవేదన
రిపోర్టర్: మహేష్
స్థలం: ముంబై
కెరీర్ తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను బాలీవుడ్ నటి తాప్సీ పన్ను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. హీరోయిన్గా ఎంపిక చేసిన తర్వాత కూడా అర్థంలేని కారణాలతో పలు సినిమాల నుంచి తనను తొలగించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. హీరో భార్యకు నచ్చలేదని, హీరోకు ఇష్టం లేదంటూ చిత్ర యూనిట్ సభ్యులు సాకులు చెప్పేవారని తెలిపారు. సినిమా నుంచి తీసేస్తున్న విషయం తనకంటే ముందే మీడియాకు లీకయ్యేదని, ఇలాంటి అవమానాలు తనను తీవ్రంగా షాక్కు గురిచేశాయని తాప్సీ పేర్కొన్నారు.