యెమెన్లో ఘోరం: సైనిక శిబిరంపై హూతీల క్షిపణి దాడిలో 53 మంది దుర్మరణం

రిపోర్టర్: విజయ్ స్థలం: యెమెన్

యెమెన్లోని దక్షిణ షాబ్వా ప్రావిన్స్లో ఇరాన్ మద్దతు గల హూతీ తిరుగుబాటుదారులు జరిపిన బాలిస్టిక్ క్షిపణి దాడిలో దాదాపు 53 మంది సైనికులు దుర్మరణం చెందారని యెమెన్ సైనిక అధికారులు తెలిపారు. శిక్షణ పొందుతున్న కొత్త రిక్రూట్లను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాద మూకలు ఈ దురాక్రమణకు పాల్పడ్డాయని, ఈ ఘటనలో మరో 200 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు పేర్కొన్నారు. ఈ దారుణకాండతో యెమెన్ అంతర్యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా విచ్ఛిన్నమైంది.