వైకాపా ప్రభుత్వంపై బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చిరాంప్రసాద్ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: రాజేష్
స్థలం: మంగళగిరి
చెత్త పన్ను పేరుతో వైకాపా ప్రభుత్వం ప్రజలపై కోట్లాది రూపాయల ఆర్థిక భారం మోపిందని బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చిరాంప్రసాద్ మండిపడ్డారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైకాపా హయాంలో లక్షలాది టన్నుల చెత్త పేరుకుపోయిందని ఆరోపించారు. ఆ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి తీరుపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ కంసమామను తలపిస్తున్నారని ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ రాజకీయంగా విమర్శలు గుప్పించారు.