బెంగళూరులో ఐఈడీ పేలుడు కలకలం: ముగ్గురు నిందితుల అరెస్ట్ చేసిన పోలీసులు

రిపోర్టర్: రాము స్థలం: Bengaluru

బెంగళూరులోని ఫ్రేజర్ టౌన్లో టార్చ్ బ్యాటరీలో అమర్చిన ఐఈడీ పేలుడు ఘటన తీవ్ర కలకలం రేపింది. భూ వివాదాలు, ఆర్థిక తగాదాల నేపథ్యంలో పక్కా పథకం ప్రకారం ఈ హత్యాయత్నం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో అస్సాంకు చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఈస్ట్ డివిజన్ డీసీపీ విక్రమ్ అమాతే వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయని అధికారులు స్పష్టం చేశారు.