భారీ లటరీ విజయం: యూఏఈలో కోటీశ్వరుడైన భారతీయ ప్రవాస వృద్ధుడు

రిపోర్టర్: వెంకట్ స్థలం: Hyderabad

యూఏఈలో జరిగిన లక్కీ డే డ్రాలో కిషోర్ పాండురంగ్ రావు అనే అరవయ్యేళ్ల భారతీయ ప్రవాసుడు ఐదు మిలియన్ల దిర్హమ్ ల భారీ బహుమతిని గెలుచుకున్నట్లు మీడియా తెలిపింది. భారత కరెన్సీలో దీని విలువ సుమారు పన్నెండు కోట్ల తొంభై లక్షల రూపాయలు ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు. తన అరవయ్యవ పుట్టినరోజుకు ముందు ఈ అదృష్టం వరించడం ఎంతో సంతోషాన్నిచ్చిందని, ఈ మొత్తంతో భార్యతో కలిసి ప్రపంచాన్ని చుట్టేయాలని భావిస్తున్నానని, అలాగే యూఏఈ గోల్డెన్ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటానని కిషోర్ తెలిపారు.