వైకాపా అధినేత ఆరోపణలపై కలెక్టర్, ఎస్పీ ఘాటు స్పందన

రిపోర్టర్: భాస్కర్ స్థలం: కడప

వైకాపా అధినేత జగన్ ఆరోపణలపై వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ విలేకరుల సమావేశంలో స్పష్టమైన వివరణనిచ్చారు. పులివెందుల పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించలేదని, హెలికాప్టర్ ల్యాండింగ్ అంశంలో సమయ మార్పుపై ఏవియేషన్ సిబ్బందికి మాత్రమే సమాచారం ఇచ్చామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అక్రమాలు జరగలేదని, నిబంధనల ప్రకారమే ఎన్నికల ప్రక్రియ నిర్వహించామని వారు వెల్లడించారు.