మద్దూరులో కార్డన్ అండ్ సెర్చ్: 79 వాహనాలు సీజ్ చేసిన పోలీసులు
రిపోర్టర్: రాజేష్
స్థలం: మద్దూరు
శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా మద్దూరు పట్టణంలోని అమర్గడ్డ కాలనీలో పోలీసులు విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు కోస్గి సీఐ సైదులు తెలిపారు. ఉదయం 5:30 నుంచి 8:30 గంటల వరకు కొనసాగిన ఈ తనిఖీల్ లో 65 మంది సిబ్బంది పాల్గొని 144 ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 79 వాహనాలతో పాటు 15.66 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.