ఓటీటీ ప్రియులకు పండగ: ఈ వారం అలరించనున్న పలు సౌత్ సినిమాలు

రిపోర్టర్: మహేష్ స్థలం: Hyderabad

ఈ వారంలో సినీ ప్రియులను అలరించేందుకు పలు సౌత్ చిత్రాలు ఓటీటీ వేదికగా సిద్ధమయ్యాయని ప్రముఖ ఎంటర్టైన్మెంట్ వర్గాలు వెల్లడించాయి. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ భాషలకు చెందిన విభిన్న చిత్రాలు డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దుల్కర్ సల్మాన్ నటించిన 'ఐయామ్ గేమ్' సినిమాతో పాటు హిప్ హాప్ తమిళా 'మీసయ మురుక్ కు 2', 'నూ కోడి ' తదితర చిత్రాలు వివిధ ఓటీటీ ప్లాట్ఫారమ్లలో వీక్షకుల ముందుకు రానున్నాయని అధికారిక సమాచారం అందింది.