ఇమ్మిగ్రేషన్ లోపంపై ఎయిర్ ఇండియా సిబ్బంది సస్పెన్షన్
రిపోర్టర్: గోపి
స్థలం: New Delhi
ఢిల్లీ నుంచి మ్యూనిచ్ వెళ్లే విమానంలో ముగ్గురు ఇటలీ ప్రయాణికులు విధిగా పూర్తి చేయాల్సిన ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ లేకుండానే బోర్డింగ్ అయిన ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ తీవ్రంగా స్పందించింది. ఈ లోపానికి బాధ్యుడైన ఎయిర్ ఇండియా సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేసినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. నిర్దేశిత విమానాశ్రయ మార్గాల్లో ప్రయాణికులను తీసుకెళ్లాల్సిన సిబ్బంది నిబంధనలను పాటించడంలో విఫలమైనట్లు విచారణలో తేలిందని తెలిపారు. భద్రతా ప్రమాణాలపై ఎలాంటి రాజీపడేది లేదని స్పష్టం చేశారు.