వైభవ్ సూర్యవంశీతో మైదానంలో తిలక్ వర్మ మాటల యుద్ధం!

రిపోర్టర్: రమేష్ స్థలం: India

దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ, ఈస్ట్ జోన్ 15 ఏళ్ల ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మధ్య తీవ్ర మాటల యుద్ధం నడిచింది. సిరాజ్ బౌలింగ్‌ను సైతం ఎదుర్కొని దూకుడుగా ఆడిన వైభవ్‌ను తిలక్ స్లెడ్జింగ్ చేశాడు. కొద్దిసేపటికే వైభవ్ వికెట్ కోల్పోవడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.