జమ్మూకశ్మీర్లో సీఐఎస్ఎఫ్ క్యాంపులో తోటి జవాన్ల కాల్పుల కలకలం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: కఠువా
జమ్మూకశ్మీర్లోని కఠువా జిల్లా బసోలి ప్రాంతంలోని సీఐఎస్ఎఫ్ క్యాంపులో విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ అభిదేశ్ కుమార్ సహచరులతో జరిగిన వివాదంతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో అసిస్టెంట్ కమాండెంట్ సహా నలుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన తోటి జవాన్లు నిందితుడిని అదుపులోకి తీసుకుని ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.