శ్రీసిటీలో అత్యాధునిక డ్రైవర్లెస్ మెట్రో రైళ్ల తయారీ పూర్తి: ఆవిష్కరణ
రిపోర్టర్: రాము
స్థలం: తిరుపతి
ముంబై మెట్రో ప్రాజెక్ట్ కోసం తిరుపతి జిల్లా శ్రీసిటీలోని తయారీ కేంద్రంలో అత్యాధునిక డ్రైవర్లెస్ మెట్రో రైళ్లను ఆల్స్టోమ్ సంస్థ విజయవంతంగా రూపొందించినట్లు ప్రతినిధులు తెలిపారు. ఎల్ అండ్ టీ భాగస్వామ్యంతో కేవలం పద్నాలుగు నెలల రికార్డు వ్యవధిలో మొదటి ఆరు కోచ్ల రైలును తయారు చేశామని, ఆత్మనిర్భర్ భారత్ ఆశయాలకు అనుగుణంగా మిగిలిన ముప్పై ఎనిమిది రైళ్లను కూడా దశలవారీగా సరఫరా చేయనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.