తీవ్ర వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళంలో అస్తవ్యస్తంగా మారిన జనజీవనం
రిపోర్టర్: రమేష్
స్థలం: శ్రీకాకుళం
తీవ్ర వాయుగుండం కారణంగా శ్రీకాకుళం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇచ్ఛాపురం నుంచి రణస్థలం వరకు తీర ప్రాంతం అతలాకుతలమైంది. బహుదా, నాగావళి, వంశధార నదుల్లో వరద ఉద్ధృతి పెరుగుతుండగా, వంశధార కాలువ వంతెన కూలిపోయింది. సోంపేట, పలాస తదితర మండలాల్లో 12,022 హెక్టార్లలో వరి పంట నీట మునిగింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 115 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు.