ప్రధాని మోదీ సేవకు ఇరవై ఐదేళ్లు అంటూ ఈటల రాజేందర్ హర్షం
రిపోర్టర్: సునీల్
స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా సేవలో ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వెల్లడించారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని ఆర్.కె. ఫౌండేషన్ మరియు రాష్ట్ర బీజేపీ మీడియా సెల్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నాయని ఆయన వివరించారు.