యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక స్పష్టత: సాధారణ ప్రజలకు పూర్తిగా ఉచితం

రిపోర్టర్: సురేష్ స్థలం: India

యూపీఐ చెల్లింపులపై వస్తున్న అపోహలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. వ్యక్తిగత లావాదేవీలు మరియు రూ.2,000 వరకు వ్యాపార చెల్లింపులు పూర్తిగా ఉచితమని స్పష్టం చేసింది. అక్టోబర్ 15 నుండి రూ.2,000 దాటిన మర్చంట్ చెల్లింపులపై నిర్దిష్ట రుసుము వర్తిస్తుందని, అయితే ఈ భారం సామాన్య వినియోగదారులపై పడదని, కస్టమర్లు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది.