పాలకొల్లులో మొబైల్ అన్న కాంటీన్ వద్ద ఉచిత భోజనాల ఏర్పాటు: మంత్రి నిమ్మల రామానాయుడు
రిపోర్టర్: హరి
స్థలం: పశ్చిమ గోదావరి
మొదటి వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని మొబైల్ అన్న కాంటీన్ వద్ద ఉచిత భోజనాలు ఏర్పాటు చేసిన కుటుంబ సభ్యులకు జలవనరుల శాఖ మంత్రి మరియు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కీశే నల్లా చాణిక్యవర్మ మొదటి వర్ధంతి వేడుకల్లో భాగంగా వారి స్వగ్రామం గుంటూరు నుంచి వచ్చి ఈ సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఆయన పేర్కొంటూ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.