బాలుడు గొర్రెల కాపరిగా మారడంపై మంత్రి నారా లోకేశ్ ఆవేదన
రిపోర్టర్: వెంకట్
స్థలం: అమరావతి
బడికెళ్లాల్సిన వయసులో ఓ చిన్నారి బాలుడు గొర్రెల కాపరిగా మారిన హృదయవిదారక దృశ్యంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకోవాల్సిన ప్రాయంలో పిల్లలు ఇలా శ్రమజీవులుగా మారుతుండటం తనను కలచివేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన, ప్రతి పిల్లాడు బడిలో ఉండాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పేదరికం కారణంగా విద్యకు దూరం అవుతున్న చిన్నారుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంత్రి లోకేశ్ వెల్లడించారు.