బీఆర్ఎస్ లోకి ఫిరాయింపు ఎమ్మెల్యేల రాకపై తీవ్ర వ్యతిరేకత

రిపోర్టర్: అశోక్ స్థలం: తెలంగాణ

తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలను తిరిగి బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించడాన్ని స్థానిక కేడర్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కష్టకాలంలో పార్టీని వీడిన అవకాశవాద నాయకులకు మళ్లీ ప్రాధాన్యత ఇవ్వొద్దని అధినేత కేసీఆర్, కేటీఆర్‌లను శ్రేణులు గట్టిగా హెచ్చరిస్తున్నాయి. ఫిరాయింపుదారులను వెనక్కి తీసుకుంటే సంస్థాగతంగా నష్టం జరుగుతుందని, యువ నాయత్వాన్ని ప్రోత్సహించాలని స్థానిక నాయకులు స్పష్టం చేస్తున్నారు.