శ్రీకాకుళం సబ్డివిజన్ నూతన డీఎస్పీగా ధనుంజయ నాయుడు బాధ్యతల స్వీకరణ

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం సబ్డివిజన్ నూతన డీఎస్పీగా సి.హెచ్. ధనుంజయ నాయుడు సోమవారం ఉదయం అధికారికంగా బాధ్యతలు స్వీకరించినట్లు శ్రీకాకుళం జిల్లా పోలీసు వెల్లడించారు. ఈ సందర్భంగా నూతన డీఎస్పీ జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి అల్పాహార సమావేశం నిర్వహించారు. పోలీసు శాఖలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తన ప్రథమ ప్రాధాన్యత అని ధనుంజయ నాయుడు ఈ సందర్భంగా స్పష్టం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.