విజయవాడ ఉత్సవ్‌కు ఘనంగా ఆహ్వానం: ఒడిశా ముఖ్యమంత్రికి ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పిలుపు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: విజయనగరం
విజయవాడ ఉత్సవ్‌కు హాజరుకావాలని కోరుతూ ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు భువనేశ్వర్‌లో మంగళవారం క్యాంపు కార్యాలయంలో కలిసి అధికారికంగా ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచన మేరకు ఆహ్వానిస్తున్నట్లు ఎంపీ ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇరు రాష్ట్రాల మధ్య సాంస్కృతిక బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పలు కీలక అంశాలపై చర్చలు జరిగాయని ఆయన పేర్కొన్నారు.