భూమి అమ్మకం డబ్బులకై కన్న కొడుకునే హతమార్చిన తండ్రి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Kanpur Dehat
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ దేహత్ జిల్లా సికింద్రా ప్రాంతంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భూమి విక్రయించగా వచ్చిన డబ్బుల విషయంలో తలెత్తిన వివాదంతో రామ్‌జీవన్ కుశ్వాహ అనే వ్యక్తి తన ఇరవై రెండేళ్ల కుమారుడు అభిషేక్ కుమార్‌ను ఇంటర్‌లాకింగ్ ఈటుకతో తలపై మోది దారుణంగా హతమార్చాడు. ఈ ఘటనలో అడ్డుకోబోయిన భార్య ఉషకు కూడా గాయాలయ్యాయి. నిందితుడు పరారీలో ఉండగా, పోలీసులు హత్య కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.