విజయనగరం లో వైస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: విజయనగరం
విజయనగరం నగరంలో ఈ నెల 19న వైస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ నియోజకవర్గ యువజన, విద్యార్థి విభాగాల ఇంచార్జి ఈశ్వర్ కౌశిక్ తెలిపారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి ఈ వివరాలు వెల్లడించారు. సుజాత ఫంక్షన్ హాల్ లో జరిగే ఈ సమావేశానికి పార్టీ శ్రేణులంతా హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.