స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి రీఎంట్రీ: సరికొత్త వ్యూహంతో వస్తున్న కార్బన్

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

దేశీయ మార్కెట్లోకి ప్రముఖ మొబైల్ బ్రాండ్ కార్బన్ మరోసారి పునరాగమనం చేస్తున్నట్లు జైనా గ్రూప్ సీఈఓ ప్రదీప్ జైన్ వెల్లడించారు. యువతను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని సరికొత్త శ్రేణి స్మార్ట్ఫోన్లను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. దేశంలో విపరీతంగా పెరుగుతున్న ఫోన్ల ధరలను దృష్టిలో ఉంచుకుని, సామాన్య ప్రజలకు తక్కువ ధరకే ఆధునిక సాంకేతికతను అందించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.