నా బతుకుదెరువు కోసమే పెళ్లిళ్లలో డాన్సులు చేస్తున్నా: రాహుల్ రాయ్
రిపోర్టర్: సునీల్
స్థలం: Mumbai
బాలీవుడ్ నటుడు రాహుల్ రాయ్ తన ఆర్థిక ఇబ్బందులపై స్పందించారు. బ్రెయిన్ స్ట్రోక్ తర్వాత పనులు లేక, కుటుంబ పోషణ కోసం పెళ్లిళ్లు, వేడుకల్లో డాన్సులు చేస్తున్నానని ఆయన తెలిపారు. ట్రోల్ చేసేవారికి నా కష్టం తెలియదని, నా బతుకుదెరువు కోసం కష్టపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విడాకులు, కోర్టు కేసుల కారణంగా ఆస్తులు కోల్పోయి, ప్రస్తుతం మొదటి నుండి జీవితాన్ని మళ్లీ నిర్మించుకుంటున్నట్లు వెల్లడించారు.