పోలవరం అడవుల్లో పెద్దపులి కలకలం, అప్రమత్తమైన అధికారులు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: పోలవరం

పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలం వాతంగి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. పులి కదలికలను గుర్తించిన అటవీశాఖ అధికారులు అధునాతన థర్మల్ డ్రోన్లతో నిఘా పెట్టారు. ప్రత్యేక రెస్క్యూ బృందాలను మోహరించి గ్రామస్థులను అప్రమత్తం చేశారు. కొండలు, అటవీ ప్రాంతాల వైపు వెళ్లవద్దని, పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.