నల్గొండ జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షుడిగా పబ్బు వంశీ గౌడ్ నియామకం

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

చౌటుప్పల్ మండలంలోని నేలపట్ల గ్రామానికి చెందిన పబ్బు వంశీ గౌడ్ భారతీయ జనతా యువమోర్చా నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు కుండే గణేష్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు కంబాలపల్లి సతీష్ యాదవ్ ఈ నియామకం చేపట్టినట్లు తెలిపారు. పార్టీ బలోపేతానికి, యువత సమస్యల పరిష్కారానికి తాను నిరంతరం అంకితభావంతో కృషి చేస్తానని నూతన ఉపాధ్యక్షుడు వంశీ గౌడ్ పేర్కొన్నారు.