తీవ్ర తుపాను ముప్పు: ఒంగోలు సమీపంలో తీరం దాటనున్న మురాసు
రిపోర్టర్: అశోక్
స్థలం: ఆంధ్రప్రదేశ్
బంగాళాఖాతంలో ఏర్పడిన మురాసు తీవ్ర తుపాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకు వస్తోందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. నవంబర్ రెండు రాత్రి నుంచి నవంబర్ మూడు తెల్లవారుజాము మధ్యలో నెల్లూరు, నర్సాపురం మధ్య ఒంగోలు సమీపంలో ఇది తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గంటకు నూట పది నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.