ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం: నవంబర్ 1న అధికారికంగా నిర్వహించాలని చంద్రబాబుకు లేఖ

రిపోర్టర్: సురేష్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని తెలుగుదండు సంస్థ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బహిరంగ లేఖ ద్వారా డిమాండ్ చేసినట్లు తెలిసింది. విభజన తర్వాత రాష్ట్రానికి అవతరణ వేడుకలు లేకపోవడం పెద్ద లోటని, అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగానికి ప్రతీక అయిన ఈ పండుగను ఈ ఏడాది నుంచి ఘనంగా జరపాలని మేధావులు కోరుతున్నట్లు ఆ సంస్థ స్పష్టం చేసింది.