'డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలు': ముంబైలో ఐఐటీయన్ సహా ఆరుగురి అరెస్ట్

రిపోర్టర్: కిరణ్ స్థలం: మహారాష్ట్ర

మహారాష్ట్రలోని ముంబైలో రూ.1.12 కోట్ల డిజిటల్ అరెస్ట్ మోసానికి పాల్పడిన కేసులో ఐఐటీయన్, ప్రైవేట్ బ్యాంకు ఆపరేషన్స్ మేనేజర్‌తో పాటు ఆరుగురిని సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు. దహిసర్‌కు చెందిన 68 ఏళ్ల రిటైర్డ్ వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు టెలికాం అధికారులు, క్రైమ్ బ్రాంచ్ అధికారులమంటూ బెదిరించి, ఆధార్ కార్డు దుర్వినియోగం అయిందని నమ్మించి రూ.1.12 కోట్లు కాజేశారు. దర్యాప్తు చేపట్టిన నార్త్ సైబర్ పోలీసులు ఆర్థిక లావాదేవీలను విశ్లేషించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.