విజయవాడలో శరవేగంగా బైపాస్ రైల్వే లైన్ పనులు

రిపోర్టర్: గోపి స్థలం: విజయవాడ

విజయవాడ రైల్వే జంక్షన్‌పై రద్దీని తగ్గించేందుకు రూ.500 కోట్లతో చేపట్టిన 22 కిలోమీటర్ల బైపాస్ రైల్వే లైను పనులు శరవేగంగా సాగుతున్నాయి. రాయనపాడు-ముస్తాబాద మార్గంలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా గూడ్స్ రైళ్లు ప్రధాన స్టేషన్‌లోకి ప్రవేశించకుండా నేరుగా వెళ్లేందుకు అవకాశం కలుగుతుంది. దీనివల్ల సరకు రవాణా మరింత వేగవంతం కావడంతో పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం తొలగిపోనుంది.