బీర్కూర్ లో అభివృద్ధి పనుల ప్రారంభం: యాసంగిలో వరి సాగుపై ఎమ్మెల్యే పోచారం కీలక సూచనలు

రిపోర్టర్: గోపి స్థలం: బీర్కూర్

కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం రైతునగర్ లో రూ.30 లక్షలతో నిర్మించిన వివిధ అభివృద్ధి భవనాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తో కలిసి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో పంట విరామం లేదని స్పష్టం చేశారు. అయితే నీటి వనరుల లభ్యత ఆధారంగానే యాసంగిలో పంటలను సాగు చేసుకోవాలని, రబీలో వరి వేసి నష్టపోవద్దని రైతులకు పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు.