ఈసోఫాగిటిస్ బారిన పడి ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నటి కిమ్ కర్దాషియన్

రిపోర్టర్: వెంకట్ స్థలం: World

ప్రముఖ రియాలిటీ స్టార్ కిమ్ కర్దాషియన్ తీవ్రమైన ఈసోఫాగిటిస్ సమస్యతో ఆసుపత్రిలో చేరినట్లు తాజా రియాలిటీ షో ట్రైలర్ ద్వారా వెల్లడైంది. అన్నవాహికలో వాపు లేదా చికాకు కలిగించే ఈ వ్యాధి కారణంగా ఆమె ఆసుపత్రిపాలయ్యారు. అయితే ఆమె తండ్రి రాబర్ట్ కర్దాషియన్ సైతం 2003లో ఇదే రకమైన అన్నవాహిక క్యాన్సర్‌తో మరణించడం గమనార్హం. ప్రస్తుతం ఈ వార్త హాలీవుడ్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.