ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ కంపెనీలో మరోసారి ఉద్యోగాల కోత
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: World
ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ రెండు నెలల వ్యవధిలోనే మరోసారి ఉద్యోగ కోతలకు శ్రీకారం చుట్టింది. తాజా లేఆఫ్స్ రౌండ్లో ఫిట్నెస్ ప్లస్ సబ్స్క్రిప్షన్ విభాగంలో పనిచేస్తున్న కొద్దిమంది ఉద్యోగులపై ప్రభావం పడింది. ఆపిల్ వాచ్ వినియోగదారులకు ఆడియో వర్కౌట్లను అందించే టైమ్ టు వాక్, టైమ్ టు రన్ వంటి ఆడియో ఫీచర్లపై పనిచేస్తున్న బృందాలను ఈ కోతలు ప్రభావితం చేశాయి. ఖర్చులను పునఃసమీక్షించుకునే క్రమంలోనే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.