కరీంనగర్లో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
రిపోర్టర్: హరి
స్థలం: Karimnagar
తెలంగాణ ముఖ్యమంత్రి ఎన్. రేవంత్ రెడ్డి కరీంనగర్ పర్యటనలో భాగంగా నూతనంగా నిర్మించిన సమైక్య జిల్లా కార్యాలయాల సముదాయం (IDOC) భవనాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సముదాయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారని తెలంగాణ సీఎంవో (Telangana CMO) అధికారికంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు మరియు పలు శాఖల ప్రముఖులు పాల్గొన్నారు.