మనుబోలులో మృతిచెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన కాకాని
రిపోర్టర్: sankar p
స్థలం: మనుబోలు
నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించి ఇటీవల మృతిచెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. అంబేద్కర్ నగర్లో చంద్రశేఖర్ తండ్రి శ్రీనివాసులు, అలాగే కోదండరామపురంలో రాఘవయ్య మృతిచెందడంతో వారి కుటుంబ సభ్యులను కలుసుకుని ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని భరోసానిచ్చారు.