తిరుమల బ్రహ్మోత్సవాలలో ఆరో రోజు వైభవంగా హనుమద్వాహన సేవ

రిపోర్టర్: వెంకట్ స్థలం: తిరుపతి

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఉదయం మలయప్ప స్వామి శ్రీరామచంద్రమూర్తి అలంకారంలో హనుమద్వాహనంపై నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శనలు భక్తిభావాన్ని ఇనుమడింపజేశాయి. మధ్యాహ్నం వసంతోత్సవం, బంగారు తేరుపై రథరంగ డోలోత్సవం నిర్వహించనుండగా, రాత్రికి స్వామివారికి గజవాహన సేవ జరగనుంది.