తెదేపాలోకి భారీగా చేరికలు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆహ్వానం
రిపోర్టర్: సతీష్
స్థలం: విజయనగరం
విజయనగరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో 130 కుటుంబాలు తెదేపాలో చేరాయి. వారికి మంత్రి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ నియమాలను, సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సీనియర్ నాయకులతో కలిసి కూటమి సమన్వయంతో పనిచేయాలని, శ్రమించే కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు.