రెజ్లింగ్ పోటీలలో ప్రతిభ చాటిన నర్సంపేట విద్యార్థులు
రిపోర్టర్: శేఖర్
స్థలం: నర్సంపేట
వరంగల్ జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ రెజ్లింగ్ సెలెక్షన్స్‌లో ఎంజేపీ నర్సంపేట పాఠశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. అండర్-14 విభాగంలో చిన్మయి, శ్రావణి, అండర్-17 విభాగంలో దీక్షిత ప్రథమ స్థానాలు సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి విజేతలను ప్రత్యేకంగా అభినందించి, క్రీడల్లో మరింత రాణించాలని ఆకాంక్షించారు.