అంతకపేటలో నూతన పింఛన్ దరఖాస్తులపై ఎంపీడీవో ఆకస్మిక విచారణ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: అక్కన్నపేట
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం అంతకపేట గ్రామ పంచాయతీ పరిధిలోని గుబ్బడిలో కొత్త పింఛన్ల దరఖాస్తులపై బుధవారం ఎంపీడీవో బి. జయరాం విచారణ చేపట్టారు. దరఖాస్తుదారులు సమర్పించిన వివరాల ఆధారంగా క్షేత్రస్థాయిలో నిజ నిర్ధారణ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొయ్యడ సృజన కుమార్, పంచాయతీ సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అధికారులకు సహకరించారు.