నీటిలో మునిగి నరకయాతన పడుతున్న శారదానగర్ వాసులు
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు శారదానగర్లో వర్షం పడితే డ్రైనేజీ నీరు రోడ్లపైకి చేరి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో పూడిక తీయకపోవడంతో మురుగునీరు ఏరులై పారుతోంది. విద్యుత్ స్తంభాలు మునిగిపోవడంతో తీవ్ర ప్రమాదం పొంచి ఉందని, ఇళ్లలోకి నీరు చేరే భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.