మునిగిన పంటలతో లబోదిబోమంటూ పరిహారం కోసం రైతన్నల హాహాకారాలు
రిపోర్టర్: NANUPATRUNI RANJITH KUMAR
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామంలో వంశధార వరద నీటిలో పంట పొలాలు పూర్తిగా మునిగిపోయాయి. తుఫాన్ ప్రభావంతో పరివాహ ప్రాంతాలు నీట మునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం తక్షణమే ఆదుకుని ఆసరాగా నిలవాలని, తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.