ఎయిర్టెల్ వినియోగదారులకు గుడ్ న్యూస్: రూ. 185 వర్సెస్ రూ. 199 ప్లాన్ల వివరాలు

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

ఎయిర్టెల్ టెలికాం సంస్థ తన కస్టమర్ల కోసం తక్కువ ధరలో రెండు అద్భుతమైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్నట్లు కంపెనీ అధికారులు వెల్లడించారు. రూ. 185 ప్లాన్ ద్వారా అన్ లిమిటెడ్ కాల్స్ తో పాటు 300 ఎస్ఎంఎస్ ల సౌకర్యం లభిస్తుందని తెలిపారు. కేవలం రూ. 14 అదనంగా చెల్లించి రూ. 199 ప్లాన్ తీసుకుంటే అన్ లిమిటెడ్ కాల్స్ తో పాటు 2జీబీ డేటా, రోజువారీ ఎస్ఎంఎస్ లు, అదనపు డిజిటల్ బెనిఫిట్స్ అందుబాటులో ఉంటాయని సంస్థ స్పష్టం చేసింది.